టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకున్న సాహో ‘బ్యాడ్ భామ’!

  • IndiaGlitz, [Tuesday,August 20 2019]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు పలువురు పాత్రలు, టీజర్ సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ న్యూస్‌ హైలైట్‌గా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో ప్రతీసారి సాహో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇప్పటికే ప్రభాస్, శ్రద్దా రెమ్యునరేషన్లపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా ఐటమ్ సాంగ్‌ ‘బ్యాడ్ బోయ్’లో నర్తించిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందట. అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకుందట. సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లా అని దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయినప్పటికీ ఇవ్వక తప్పలేదట. తెలుగులో టాప్ హీరోయిన్లే ఒక్కో సినిమా కోసం ఇంత మొత్తం తీసుకోవట్లేదే.. ఒక్క ఐటమ్ సాంగ్‌ ఈ రేంజ్‌లో తీసుకోవడమా..? సినీ ప్రియులే కాదు.. టాలీవుడ్ నటీనటులు సైతం ఆశ్చర్యపోతున్నారట. అయితే.. ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

More News

యడియూరప్ప కేబినెట్ ఏర్పాటైన గంటల్లోనే అసంతృప్తి సెగలు

కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారంనాడు కొత్త కేబినెట్ ఏర్పాటైన విషయం విదితమే.

బాబుకు ఊహించని షాక్.. లేడీ ఫైర్ బ్రాండ్స్‌ బీజేపీలోకి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి.

విల‌న్ స‌తీమ‌ణికి... ప్ర‌భాస్ గిఫ్ట్!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మంచి త‌నం గురించి ఒక్కొక్క‌రూ ఒక్కో విష‌యాన్ని చెబుతున్నారు. ఎన్నో వెరైటీలు బ‌ల‌వంతంగా తినిపిస్తాడ‌ని కొంద‌రు చెప్పారు.

అల్లు అర్జున్ కోసం... రూ.5కోట్ల సెట్‌!

అల్లు అర్జున్  ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` త‌ర్వాత ఆయ‌న చేస్తున్న సినిమా `అల వైకుంఠ‌పురంలో...`

ఐశ్వ‌ర్యా రాజేష్‌కి చాలా స్పెష‌ల్‌

ఐశ్వ‌ర్యా రాజేష్ కి ఈ నెల 23వ తేదీ చాలా చాలా స్పెష‌ల్‌. తెలుగులో ఆమె న‌టించిన తొలి స్ట్రెయిట్ చిత్రం `కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి` విడుద‌ల కానుంది.