`సాహో` సెన్సార్ పూర్తి..

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.350కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. వివరాల ప్రకారం రన్ టైమ్ 174 నిమిషాలని తెలిసింది. అంటే దాదాపు మూడు గంటలు. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చినట్టే. మందిరాబేడి, చంకీపాండే, నీల్ నితిన్, అరుణ్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా ఆగస్ట్ 30న విడుదల కానుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన ‘సాహో’ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ట్రేడ్ వర్గాలు ‘సాహో’ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఓవర్ సీస్ సహా అన్నీ భాషల్లో రూ.333కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకున్నట్లు టాక్.

సినిమాలో అశోక చక్రవర్తి అనే అండర్ కవర్ కాప్‌గా నటిస్తుండగా.. శ్రద్ధాకపూర్ అమృతానాయర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. హాజీ సిటీలో బ్లాక్ బాక్స్ కోసం ప్రపంచంలోని గ్యాంగ్ స్టర్స్ అందరూ ప్రయత్నిస్తుంటారు. వారికి ధీటుగా ప్రభాస్ ఏం చేశాడనేదే ఈ సినిమాగా తెలుస్తుంది. ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత యువ దర్శకుడు సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ .. నమ్మకంతో తన మిత్రులైన యు.వి.క్రియేషన్స్‌తో కలిసి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ప్రభాస్ కొట్టే ‘సాహో’ సిక్సర్ రికార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే..

More News

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

టాలీవుడ్ సీనియర్ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతోందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మరింత బలపడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాగే చిదంబరం కూడా..!’

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదన్న విషయం విదితమే.

'ఉండి పోరాదే' సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న రిలీజ్

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో

వైఎస్ జగన్ ‘బాహుబలి’.. గౌతమ్ ‘సైరా నర్సింహారెడ్డి’!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘బాహుబలి’, మంత్రి గౌతమ్ రెడ్డి..