close
Choose your channels

'సాహో' సెన్సేష‌న్‌

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లితో తెలుగు సినిమా రేంజ్ ప్ర‌పంచ స్థాయికి చేరింది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే త‌దుప‌రి  ప్ర‌భాస్ ఏ సినిమాలో న‌టిస్తాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ 'సాహో' సినిమా అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు రూపొందుతుంది. అయితే అంద‌రూ ఈ సినిమా కోసం ఎంత‌లా ఎదురు చూస్తున్నారనేది రీసెంట్‌గా విడుద‌లైన కొత్త లుక్‌తో తెలిసింది.

మంగ‌ళ‌వారం ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా 'సాహో' కొత్త లుక్‌, రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ లుక్‌కు సోష‌ల్ మీడియాలో ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తుంది. 24 గంట‌ల్లో ఈ పోస్ట‌ర్‌కు 7,84,586 లైక్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రే తెలుగు సినిమా ఇన్ని లైక్స్‌ను సాధించ‌లేద‌ట‌. సినిమా పోస్ట‌ర్‌కే ఇంత రెస్పాన్స్ వ‌స్తే.. ఇక సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో ఎక్స్‌పెక్ట్ చేయండి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.