సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న 'సాహో'

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ , ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, టినూ ఆనంద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం అబుదాభిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో భాగంగా వోల్వో బస్సులతో పాటు.. హై-ఎండ్ బైక్స్, కార్లతో దుబాయ్ రోడ్లపై చేజింగ్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు సంబంధించిన పిక్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక హైఎండ్ స్పోర్ట్స్ బైక్‌పై జాకెట్‌తో స్టైల్‌గా ఉన్న ప్రభాస్ పిక్స్‌.. సాహో చిత్రంలోని దృశ్యాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. సినిమాకు సంబంధించి ఒక్క పిక్ కూడా లీక్ అవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తుండడంతో.. ఈ పిక్ ఈ సినిమాకి సంబంధించినదో, కాదోన‌న్న‌ స్పష్టత లేనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు.

More News

షూటింగ్‌ పూర్తి చేసుకున్న భారీ గ్రాఫిక్‌ చిత్రం 'భద్రకాళి'

ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో సీనియర్‌ నటి సీత టైటిల్‌ పాత్రలో యువ నిర్మాత చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో  రూపొందిస్తున్న చిత్రం 'భద్రకాళి'.

సమ్మోహనం​ టీజర్ చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది - మెగాస్టార్ చిరంజీవి

"సమ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా

సూర్య - మిర్యాల రవీందర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కార్తీ 'చినబాబు'

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో

వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా 'శంభో శంక‌ర' తొలి లిరిక‌ల్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ‌

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ  నిర్మిస్తోన్న

'మిఠాయి' ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ఫిక్స్‌లాయిడ్‌

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,.