close
Choose your channels

‘సాహో’ స్టోరీ తెలిసిపోయిందోచ్..!

Sunday, August 25, 2019 • తెలుగు Comments

‘సాహో’ స్టోరీ తెలిసిపోయిందోచ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాపై పెద్ద ఎత్తున వార్తలే కాదు.. పుకార్లు సైతం వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, శ్రద్దా రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు ఓ రేంజ్‌లో హల్ చల్ చేయగా.. తాజాగా ‘సాహో’లో పెద్ద ట్విస్ట్ ఇదే.. సాహో కథ ఇదే అంటూ పుకార్లు చెలరేగాయి. ఇందులో నిజానిజాలు ఏ మాత్రం ఉన్నాయోగానీ మీడియాలో పుంకాలు పుంకాలుగా కథనాలు మాత్రం వస్తున్నాయి.

అసలు విషయానికొస్తే.. ‘సాహో’ ట్రైలర్‌లోనే రూ. 2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించిన విషయం విదితమే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు పెద్ద ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్ కనిపించబోతున్నాడట. ప్రమోషన్స్ షురూ చేయడం.. 

సినిమా రిలీజ్‌కు సమయం కూడా దగ్గరపడటంతో ఈ సీక్రెట్‌ను చాలా జాగ్రత్తగా చిత్రబృందం మెయింటైన్ చేస్తోందట. సినిమా మొత్తానికి ఇదే అసలు సిసలైన ట్విస్ట్ కావడంతో చిత్రబృందం కూడా అధికారికంగా స్పందించలేదని సమాచారం. ఒకవేళ ప్రభాస్‌ నిజంగానే డ్యూయల్ రోల్‌ కనిపిస్తే మాత్రం డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆగస్టు 30 వరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz