close
Choose your channels

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం `సాహో`. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. రూ.350 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం కావడంతో `సాహో`పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్ట్ 30న విడుదలవుతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ మరింతగా పెంచింది.

రీసెంట్‌గా విడుదలైన సాహో ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌కు తెరతీసింది. ట్రైలర్ విడుదలైన 48 గంటల్లోనే 70 మిలియన్ వ్యూస్2ను రాబట్టుకుంది. మరి రేపు సినిమా విడుదలైతే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.