అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

  • IndiaGlitz, [Monday,April 09 2018]

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 15 రోజుల షెడ్యూల్ లో అమెరికాలోని సుదరమైన లొకేషన్స్ లో చిత్ర బృందం చిత్రీకరణ జరపనుంది.

న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల నడుమ ఒక సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు.

హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య  తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

More News

నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.

'RX 100' జూన్‌లో విడుద‌ల‌!

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది.

ప్ర‌భాస్, పూజా హెగ్డే మూవీ అప్‌డేట్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

వరుస సినిమాల‌తో ర‌వితేజ బిజీబిజీ

కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పటినుంచి  ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అయ్యేట్టు ప్లాన్ చేసుకున్నారు హీరో రవితేజ.

'సాహో' తాజా షెడ్యూల్ గురించి సాబు సిరిల్ ఏమ‌న్నారంటే..

నాలుగు సార్లు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డుల‌ను కైవసం చేసుకున్నారు సాబు సిరిల్. ఐదు సార్లు బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.