జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..

  • IndiaGlitz, [Monday,July 23 2018]

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

More News

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు.

శ్రీనివాసుడి కల్యాణ గీతాలు

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'.

ఝాన్సీ టీజర్ విడుదల చేసిన సుధీర్ బాబు

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధం అవుతుంది.

'ప్రేమకు రెయిన్ చెక్' టీజర్ లాంచ్

"రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఇప్పుడిదే టైటిల్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి