పవర్‌స్టార్‌ సినిమా గురించి సాగర్‌ చంద్ర ఏమన్నాడంటే....!

  • IndiaGlitz, [Sunday,November 15 2020]

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం వకీల్‌సాబ్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న పవన్‌, తదుపరి మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియునుమ్‌' రీమేక్‌లో నటించబోతున్నారు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఇందులో పవన్‌తో పాటు రానా కూడా నటించే అవకాశాలున్నాయి.

రీసెంట్‌గా ఈ సినిమా గురించి దర్శకుడు సాగర్‌ కె.చంద్ర మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ అభిమానిగా ఆయన్ని ఫ్యాన్స్‌ ఎలా చూడాలని అనుకుంటారో అలా సినిమాను మారుస్తున్నాం. తప్పకుండా సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో నాకు తెలుసు. ఆ అంచనాలను తప్పకుండా రీచ్‌ అవుతాం. అలాగే తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగినట్లు సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నాం అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తుందని టాక్‌. పొల్లాచ్చిల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ జరిగిపోయింది. వచ్చేఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నారట.