Sahkutumbanam:అచ్చ తెలుగు టైటిల్‌తో ‘సఃకుటుంబానాం’.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్..

  • IndiaGlitz, [Saturday,April 13 2024]

HNG సినిమాస్ బ్యానర్‌ మీద మహాదేవ గౌడ్ నూతనంగా నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సినిమాకు ఉదయ్ శర్మ రచన, దర్శకత్వం చేయగా.. రామ్ కిరణ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక హీరోయిన్‌గా మేఘ ఆకాష్ నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ సినిమా పేరుకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అచ్చమైన తెలుగింటి టైటిల్ అని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. రేషన్ కార్డు డిజైన్‌లా ఉన్న పోస్టర్ బట్టి సినిమా కూడా మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుంది అనేలా ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ రావడం చాలా సంతోషం. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ, రమేష్ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మ్యుజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సఃకుటుంబానాంకు మ్యుజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా మధు దాసరి, శశాంక్ మాలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అని తెలిపారు.

డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ రేషన్ కార్డు లాగా ఉన్న ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ గారు చాలా పెద్ద అసెట్. కంటెంట్ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. రీసెంట్ గా ఇంత మంది ఆర్టిస్టులు ఇంత మంచి కాంబినేషన్స్ తో ఏ సినిమా రాలేదు, కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపిస్తారు. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది, ఎంతో మంది సీనియర్స్ ఇందులో నటించారు, వాళ్ళ నటన గురించి ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు. మీరు ఊహించని కంటెంట్ ని మేము చూపిస్తాము. నిర్మాత మహాదేవ గౌడ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక షెడ్యూల్ ఉంది అనగానే వెంటనే సపోర్ట్ చేసేవారు. చాలా ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఈ సినిమాని, ఈ బ్యానర్ ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

తారాగణం: రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం, తదితరులు