సాయితేజ్, దేవ్ కట్టా చిత్రం ‘రిపబ్లిక్’ నుంచి ‘జోర్ సే...’ సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,September 07 2021]

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ 'రిప‌బ్లిక్‌'. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. సోమవారం ఈ సినిమా నుంచి ‘జోర్ సే...’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘‘సిగురు సింత‌ల మీద రామ‌సిల‌క‌లోయ్‌
ప‌గ‌లే దిగినాయ్ సూడు చంద్ర వంక‌లోయ్‌
సెరుకు పిల్లాడూ చూసే సూపు సురుకులోయ్‌
క‌లికి బుగ్గ‌ల మీద సిగ్గు మొల‌క‌లోయ్‌
చూడ‌బోద‌మా.. ఆడ‌బోద‌మా

చూడ‌బోద‌మా.. ఆడ‌బోద‌మా
ఏ సెయ్యి సెయ్యి క‌లిసి సేర‌బోద‌మా
జోర్‌సే బార్‌సే తెర‌సాప జార్‌సే...పడవనింక జోర్ సే ’’

అంటూ సాగే ఈ పాట ప‌ల్లెటూరిలో జ‌రిగే పండ‌గ వాతావ‌ర‌ణం..అక్క‌డ హీరో, హీరోయిన్ మ‌ధ్య హుషారుగా వ‌చ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన రిప‌బ్లిక్ చిత్రంలో ఈ పాట‌ను సుద్దాల అశోక్ తేజ రాశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, సాకి శ్రీనివాస్‌, బ‌రిమి శెట్టి పాడారు.

సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పటికే హీరో సాయితేజ్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, కీలక పాత్రధారులు జగపతిబాబు, రమ్యకృష్ణ పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌తో పాటు ‘గానా ఆఫ్ రిపబ్లిక్..’ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా.. ఇప్పుడు ‘జోర్ సే’ సాంగ్ విడుదలైంది.

సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

More News

కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` - ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌

'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత  నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా

విజ‌య్‌దేవ‌ర‌కొండ లైగ‌ర్ చిత్రంలో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ పాడిన ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ

తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్ర‌ముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒక‌రు.

బాలీవుడ్ స్టార్స్‌కు తెలుగు ఆస్ట్రో ఎండీ బాలు మున్నంగి సెంటిమెంట్

సినిమాలో 24 శాఖలు ఉంటాయి. ఆయా శాఖల్లో పని చేసిన వ్యక్తుల పేర్లు టైటిల్ కార్డ్స్‌లో వేస్తారు.

'డిజె టిల్లు' టీజర్ విడుదల

"రెడీ ఆ రా.... రెడీ అన్నా  హ ద సూస్కో కళ్ళు తెరవాలన ద తెరువు తెరువు తెరువు

'పంచతంత్రం'లో దేవిగా దివ్య శ్రీపాద... ఆమె పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.