యు.ఎస్‌కు తేజ్‌.. అందుకే...

  • IndiaGlitz, [Monday,July 16 2018]

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కెరీర్ ప్రారంభంలో హిట్స్ అందుకున్నాడు. త‌ర్వాత విజయాలు క‌రువైయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన 'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం కూడా నిరాశ ప‌రిచింది. ఇలా వరుస‌గా ఆరు సినిమాలు తేజుకి హిట్‌ను అందించ‌లేక‌పోయాయి.

ఎలాగైనా హిట్ కొట్టాల‌నే త‌లంపుతో తేజు ఈసారి మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. కిశోర్ తిరుమ‌ల‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ఫై చేయ‌నున్న సినిమా మేకోవ‌ర్ కోసం తేజు అమెరికా వెళుతున్నాడు. 'చిత్రల‌హ‌రి' అనే పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, రితికా సింగ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో సునీల్ న‌టిస్తున్నారు.