రెగ్యులర్‌ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్‌ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,December 12 2017]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఐ.ఎం.టి. కాలేజీలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ''మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. కంటిన్యూగా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌గారితో మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌కి మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది'' అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, సురేఖావాణి, వైవా హర్ష, జోష్‌ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్‌, అభిషేక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఆర్ట్‌: సాయిసురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, పోతుల రవికిరణ్‌, మాటలు: 'డార్లింగ్‌' స్వామి, స్టిల్స్‌: వెంకట్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీష్‌ కొప్పినీడి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వి.మోహన్‌, కో-ప్రొడ్యూసర్‌: కె.ఎ.వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More News

డిసెంబ‌ర్ 15న 'ఇదీ మా ప్రేమ‌క‌థ‌'

యాంకర్ రవి హీరోగా పరిచమవుతున్న  చిత్రం 'ఇది మా ప్రేమ కథ'. 'శశిరేఖా పరిణయం' సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది.

నాని,విక్ర‌మ్ కుమార్ మూవీ డిటైల్స్‌

వరుసగా ఆరు విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు త్రిపుల్ హ్యాట్రిక్‌కి ఆయ‌న శ్రీ‌కారం చుడుతున్నారు. ఆ చిత్ర‌మే.. ఈ నెల 21న రాబోతున్న ఎం.సి.ఎ. సినిమా. దాంతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తున్నారు నాని.

నితిన్ సినిమాకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే కాదు.. ఆయ‌న అభిమాని నితిన్ కూడా వ‌చ్చే ఏడాది 25వ చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసితో 25 చిత్రాల‌ను పూర్తిచేసుకుంటే.. నితిన్ ఏమో ప‌వ‌న్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌లిసి నిర్మిస్తున్న చిత్రంతో 25 సినిమాల‌ను పూర్తిచేసుకుంటున్నాడు.

మనం సైతం సభ్యులను అభినందించిన మెగాస్టార్

నిస్సహాయులకు అండగా నిలబడి సాయం అందిస్తున్న మనం సైతం సభ్యులను మెగస్టార్ చిరంజీవి అభినందించారు. మనం  సైతం ఛారిటీ కార్యక్రమాలను సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ ని అడిగి తెలుసుకున్నారు.

దర్శకేంద్రుడు మెచ్చిన 'మళ్ళీరావా'

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్ళీరావా' ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.