నయనతార 'వాసుకి' సాంగ్ రిలీజ్ చేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Monday,July 24 2017]

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ 'వాసుకి' సినిమాలోని సాంగ్‌ను విడుద‌ల చేశారు. శ్రీరామ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌.ఆర్‌.మోహన్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సినిమా 'వాసుకి'. నయనతార టైటిల్‌ పాత్రలో నటించింది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన 'పుదియనియమం' సినిమాకు తెలుగు అనువాదమే 'వాసుకి'.
ఈ సినిమా జూలై 28న విడుద‌ల‌వుతుంది. పాట విడుద‌ల అనంతరం సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌లయాళంలో విజ‌య‌వంత‌మైన 'పుదియ నియ‌మం' సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్న నిర్మాత ఎస్‌.ఆర్‌.శ్రీరామ్ అండ్ టీంకు అభినంద‌న‌లు తెలిపారు. నిర్మాత ఎస్‌.ఆర్‌.శ్రీరామ్‌ మాట్లాడుతూ..'నేను లాయర్‌ని. ఈరోజు నేను సినిమా విడుదల చేసే స్థాయికి వచ్చానంటే కారణం కూడా సినిమానే. సినిమాలంటే ఉన్న ఆసక్తితో డబ్బులు కూడబెడుతూ వచ్చి పుదియ నియ‌మం సినిమా హక్కులను కొని తెలుగులో 'వాసుకి' పేరుతో జూలై 28న విడుదల చేస్తున్నాను. స‌మాజంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను సందేశాత్మ‌కంగా తెర‌కెక్కించిన సినిమా ఇది. న‌య‌న‌తార‌గారి న‌ట‌న హైలైట్‌గా ఉంటుంది. సాంగ్‌ను విడుద‌ల చేసి మాటీంకు స‌హ‌కారం అందించిన సాయిధ‌ర‌మ్ తేజ్‌గారికి థాంక్స్‌. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్షకుల ఆశీర్వదిస్తారనుకుంటున్నాను'' అన్నారు.

More News

అమెరికా ఓహియో ఇంటర్ నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా 'రక్తం' కు గానూ నామినేట్ అయిన బెనర్జీ!

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్రమే.

అక్టోబర్ 13న విడుదలకానున్న 'రాజుగారి గది 2'

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ "రాజుగారి గది 2".

హ్యాపీ బర్త్ డే టు యూనిక్ స్టార్ విజయ్ ఆంటోని

సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాకు అద్భుతమైన సంగీతానందించారు. మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకుడిగా, సింగర్గా, యాక్టర్గా, నిర్మాతగా ఇప్పుడు అన్ని రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్నారు.

'ఫిదా' టీమ్ ను అభినందించిన సీఎం కె.సి.ఆర్

వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఫిదా`.

పీతపై సినిమా

ఈగ సినిమాతో రాజమౌళి ఈగకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. గతంలో పాము, ఏనుగు వంటి ఎన్నోజంతువులపై సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. అయితే విజువల్ వండర్గా వచ్చిన ఈగ సినిమా మంచి క్రేజ్ను సంపాదించుకుంది.