సెట్‌లో ‘వెల్‌కమ్ సాయితేజ్’ అంటూ ఫ్లకార్డ్స్.. కంటతడి పెట్టిన మెగా మేనల్లుడు

  • IndiaGlitz, [Tuesday,March 29 2022]

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. నాటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అంటూ అభిమానులు తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో సాయితేజ్ ఇటీవల ఓ వీడియో సందేశం ద్వారా అభిమానులను పలకరించారు. త్వరలోనే తన సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు. అన్న మాట ప్రకారం ఈరోజు షూటింగ్‌కు హాజరయ్యారు.

సాయి తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకుడు సుకుమార్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై తెరకెక్కుతోంది. సాయి తేజ్ కెరీర్‌లో 15వ చిత్రమిది. షూటింగ్‌లొ పాల్గొనేందుకు సాయి ధరమ్ తేజ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు యూనిట్ అంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. యూనిట్ సభ్యులు 'వెల్కమ్ సాయి తేజ్' అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఆత్మీయ స్వాగతం చూసి సాయి తేజ్ చలించిపోయారు. ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెడుతూ అందరికీ నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా .. గతేడాది వినాయక చవితి పండుగనాడు సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

More News

ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, రేసులో ‘అల్లు’ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది.

రూపాయి.. రూపాయి దాచుకుని రూ. 2.6 లక్షల పోగేసి .. డ్రీమ్ బైక్ కొన్న యువకుడు

చిన్నప్పుడు మనకు నచ్చిన వస్తువు అమ్మానాన్న కొనివ్వలేదు అనుకోండి.. అప్పుడేం చేసేవాళ్లం..

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్ పరిధిలోకి కీలక నగరం

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అదుపులోనే వుంది. కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఓటీటీ డేట్ క‌న్ఫార్మ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘రాధేశ్యామ్’’.

సజీవ దహనాల కేసు: బెంగాల్ అసెంబ్లీలో అరుపులు, కేకలు.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్‌‌లో ఇటీవల చోటుచేసుకున్న బీర్‌భూం సజీవద హనాల ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.