వాళ్లందరికీ థ్యాంక్స్ : ఎట్టకేలకు బయటకొచ్చి గుడ్‌న్యూస్ , సాయితేజ్ వీడియో వైరల్

  • IndiaGlitz, [Saturday,March 26 2022]

గతేడాది రోడ్డు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇంటికే పరిమితమైపోయారు మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్‌కు హాజరవ్వడం తప్పించి.. బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సాయి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పట్లో తమ హీరో సినిమా చేస్తారా లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాయి థరమ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు.

తాజాగా విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని పేర్కొన్నారు. అయితే తేజూలో గతంలో మాదిరి ఉత్సాహం కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా .. గతేడాది వినాయక చవితి పండుగనాడు సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

More News

చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్ : ఆర్ఆర్ఆర్‌పై అల్లు అర్జున్ రివ్యూ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... భుజాలపై కూతురి మృతదేహాన్ని 10 కిలోమీటర్లు మోసుకుంటూ

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమంటూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తూ వుంటారు.

కలెక్టర్ సిద్ధార్ధ్ రెడ్డి వచ్చేశారు... ఊర మాస్ లుక్‌లో నితిన్ ఫస్ట్‌లుక్

హిట్టూ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు తీసే హీరోల్లో నితిన్ కూడా ఒకరు. వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న ఆయన..

ఆర్ఆర్ఆర్ రిలీజ్ : తండ్రి మందలించాడని .. ఉరేసుకుని అభిమాని ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ‘‘ఆర్ఆర్ఆర్’’ మ్యానియానే నడుస్తోంది.

బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.