మ‌ణిర‌త్నంతో సాయిప‌ల్లవి?

నేటి త‌రం హీరోయిన్స్‌లో సాయిప‌ల్ల‌వి వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ త‌మివ‌ళ పొన్ను రానాతో ‘విరాట‌ప‌ర్వం’ సినిమాతో పాటు... నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ల‌వ్‌స్టోరి’లోనూ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు సెట్స్‌పైనే ఉన్నాయి. ఇవి కాకుండా ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టించ‌డానికి సాయిప‌ల్ల‌వి ఓకే చెప్పింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం, నెట్‌ఫ్లిక్స్ కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌నున్నార‌ట‌. ‘న‌వ‌ర‌స‌’ పేరుతో రూపొంద‌బోయే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉంటాయి. వీటిని తొమ్మిది మంది ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌నున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఓ ఎపిసోడ్‌ను ‘అసుర‌న్‌’ ఫేమ్ వెట్రిమారన్ తెర‌కెక్కించునున్నార‌ట‌. ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ ఎపిసోడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడు తండ్రిగా, సాయిప‌ల్ల‌వి కూతురు పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ట‌. మ‌రి మిగిలిన ఎపిసోడ్స్‌ను ఎవ‌రు తెర‌కెక్కిస్తారు? అందులో ఎవ‌రు న‌టిస్తారు? అనే విష‌యం తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

అల్లు అర్జున్‌ని అలా చూపించ‌నున్న కొర‌టాల‌!!

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌,  సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా...

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

నితిన్‌కు అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ ఇచ్చిన ‘రంగ్ దే’ యూనిట్‌

ఆదివారం(జూలై 26) హీరో నితిన్ నెచ్చెలి షాలిని పెళ్లి హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నామా ప్యాలెస్‌లో రాత్రి 8గంట‌ల 30 నిమిషాల‌కు జ‌ర‌గ‌నుంది.

తెలంగాణలో తాజాగా 1593 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సరికొత్తగా విడుదల చేశారు.

హీరో విశాల్‌ తండ్రికి కరోనా పాజిటివ్.. ఆయనకు సాయం చేస్తూ..

ఇప్పటి వరకూ బాలీవుడ్‌పై పంజా విసిరిన కరోనా తాజాగా కోలీవుడ్‌కూ పాకింది. ఇప్పటికే కోలీవుడ్‌కి చెందిన అర్జున్ కూతురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..