కోలు కోల‌మ్మా.. అంటోన్న సాయిప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Thursday,February 25 2021]

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి తన‌దైన శైలిలో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తోన్న చిత్రాల్లో ‘విరాట‌ప‌ర్వం’ ఒక‌టి. రానా దగ్గుబాటి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి గురువారం ‘కోలు కోల‌మ్మా..’ అనే లిరిక‌ల్‌ సాంగ్‌ను హీరో వెంక‌టేశ్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న విరాట‌ప‌ర్వంలో రవ‌న్న పాత్ర‌లో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాయిప‌ల్ల‌వి పాత్ర గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం ఏ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

‘కోలు కోల‌మ్మా..’ సాంగ్ విషయానికి వస్తే ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాయ‌గా, దివ్యా మాలిక్ పాడింది. జాన‌ప‌ద శైలిలో పాట సాగుతుంది. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్‌బాబు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

'లౌక్యం' సక్సెస్ తర్వాత ఆనందప్రసాద్ గారు ఐఫోన్ లు ఇచ్చారు. 'చెక్'కి అంతకంటే పెద్దగిఫ్ట్ అడగాలి! - సంపత్ రాజ్

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్

పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో కళా దర్శకునిగా 'ఆనంద్ సాయి'

కళా దర్శకుడు 'ఆనంద్ సాయి' పరిచయం వాక్యాలు అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'

ప‌వ‌న్ ట్రీట్ రెడీ అవుతోంది..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం హైదరాబాద్‌లో చ‌క చ‌కా జ‌రుగుతోంది.

‘ఆచార్య’ సెట్‌లో వీడియో, ఫొటోలు లీక్‌..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం  ‘ఆచార్య’. చిరంజీవి 152వ చిత్రమిది.

బీజేపీలోకి పీటీ ఉష?

పరుగుల రాణి పీటీ ఉష రాజకీయాల్లోకి రాబోతున్నారా? కమలదళంలో చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.