విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సాయిప‌ల్లవి?

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

'ఫిదా' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత 'ఎంసీఏ' చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో శ‌ర్వానంద్‌తో 'ప‌డిప‌డి లేచె మ‌న‌సు' చిత్రాన్ని చేస్తున్న సాయిప‌ల్ల‌వి.. త‌మిళంలో సూర్య‌తో 'ఎన్‌.జి.కె' చిత్రాన్ని.. ధ‌నుష్‌తో 'మారి 2' చిత్రాన్ని చేస్తున్నారు.

ఈ మూడు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానున్నాయి. అలాగే 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' ద‌ర్శ‌కుడు క్రాంతి మాధవ్‌.. యూత్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా సాయిప‌ల్ల‌వి న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

More News

శ్రీరెడ్డి వ్య‌వ‌హారం నోరు విప్పిన నాని భార్య‌...

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో హాల్ చ‌ల్ చేసిన శ్రీరెడ్డి.. నేచురల్ స్టార్ నాని త‌న‌ను వాడుకుని వ‌దిలేశాడ‌ని.. రీసెంట్‌గా త‌న‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నాడ‌ని..

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను త‌న సొంతం చేసుకున్నారాయ‌న‌.

'ల‌వ‌ర్' కోసం బాలీవుడ్ టెక్నీషియ‌న్

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

నా లవ్ స్టోరీ ఆడియో విడుదల

అందమైన ప్రేమకథ గా మలిచిన 'నా లవ్ స్టోరీ' ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది.

'ఈ మాయ పేరేమిటో' ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసిన నాగ‌చైత‌న్య‌

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.