నానిని మ‌రోసారి ఫిదా చేయ‌నుందా?

  • IndiaGlitz, [Monday,June 22 2020]

నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఉగాదికి విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. మ‌రో ప‌క్క శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ట‌క్‌జ‌గ‌దీష్ సినిమాను పూర్తి చేయ‌డానికి నాని సిద్ధంగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యామ్ సింగ‌రాయ్ సినిమా చేయాల్సి ఉంది.

ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. అలాగే నాని స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. ఎవ‌రిని నాని ప‌క్క‌న న‌టింప చేయాలా చేయాలా అని యూనిట్ హీరోయిన్స్ అన్వేష‌ణ‌లో ఉంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు హీరోయిన్స్‌తో యూనిట్ స‌భ్యులు సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. ష్మిక మందన్నా, రాశీ ఖన్నా, సాయిపల్లవి, నివేథా ధామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మలు ఈ లిస్టులో ఉన్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇందులో ఓ హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ఇది వ‌ర‌కు ఎంసీఏ చిత్రంలో వీరిద్ద‌రూ జంట‌గా క‌న‌ప‌డి మెప్పించారు. మ‌రోసారి వెండితెర‌పై జంట‌గా ఫిదా చేస్తారో లేదో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు.

More News

సమంత పాన్ ఇండియా మూవీ..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.

బాల‌య్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు

తెలుగు నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్‌లో న‌టించిన న‌టి రాధికా ఆప్టే. ఆమెకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అరుదైన అవార్డు ల‌భించింది.

మ‌హేశ్ ‘సర్కారు వారి పాట’లో చెర్రీ విల‌న్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ ఫారిన్ వెళ్తాడా?

క‌రోనాకు పెద్దా చిన్నా తేడా లేకుండా అంద‌రూ వ‌ణుకుతుంటే, ప్ర‌భాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?

విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.