విష్ణు ఆ..డైరెక్టర్ తో సినిమా చేస్తున్నడా....?

  • IndiaGlitz, [Friday,September 04 2015]

మంచు విష్ణు తాజా చిత్రం డైన‌మేట్ రిలీజ్ అయ్యిందో లేదో...అప్పుడే త‌న త‌దుప‌రి చిత్రం ప్రారంభోత్స‌వం చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. డైన‌మేట్ త‌రువాత విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విష్ణునే నిర్మించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ప్ర‌చారంలో ఉన్న‌ట్టు వెంట‌నే విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప చిత్రం చేయ‌డం లేదు. దీని కంటే ముందు మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసాడు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు....నాగ్ మేన‌ల్లుడు సుశాంత్ తో అడ్డా చిత్రాన్ని తెర‌కెక్కించిన సాయి రెడ్డి డైరెక్ట‌ర్. విభిన్న క‌ధాంశంతో రూపొందే ఈ సినిమాని ఈ నెల 10న‌ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...పూరి శిష్యుడు సాయి రెడ్డితో విష్ణు ఎలాంటి సినిమా చేస్తున్నాడనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

విష్ణు, జె.డి మధ్య మాటల్లేవ్..

మంచు విష్ణు హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం డైనమేట్.ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్.ఈ చిత్రంలో విష్ణు హీరోగా నటించగా, జె.డి విలన్ గా నటించారు.

తెలుగులో పాటలు పాడునున్న 'పులి'

‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా చింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘పులి’.

'గుంటూరు టాకీస్' ఆడియో రిలీజ్ డేట్...

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు.

మంచు లక్ష్మీ రోల్ ను అక్కడకత్రినా చేస్తుందట...

లక్ష్మీ మంచు, అడవిశేష్ ప్రధాన పాత్రల్లో మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘దొంగాట’. లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చితానికి వంశీ కృష్ణ దర్శకుడు.

రజనీ, శంకర్ ల సినిమాకి ముహుర్తం కుదిరిందా?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.