బీజేపీ చేరిన సైనా.. సక్సెస్ అయ్యేనా!?

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని రోజులుగా బ్యాడ్మింటన్ కోర్టులో శ్రమించిన సైనా ఇకపై ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని నిర్ణయించారు. అందుకే రాజకీయాల వైపు ఆమె అడుగులేశారు. బుధవారం నాడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సైనాకు కాషాయ కండువా కప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అరుణ్ సింగ్.. సైనా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం శుభసూచికమన్నారు. చేరిక అనంతరం పార్టీ పెద్దలు ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు.

సోదరి కూడా!
సైనా నెహ్వాల్‌తో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. సైనా మాట్లాడుతూ.. ‘నేను కష్టపడి పని చేసే వ్యక్తిని. దేశ సంక్షేమం నిరంతరం కృషి చేసే ప్రధాని మోదీతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’ అని అన్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బలం పెంచుకుంటున్న బీజేపీకి సైనా లాంటి ప్రముఖ వ్యక్తి పార్టీలో చేరడం మంచి పరిణామామేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సైనా గురించి మూడు ముక్కల్లో..!
హర్యానాలో జన్మించిన సైనా హైదరాబాద్‌లో పెరిగి పుల్లెల గోపీచంద్ దగ్గర బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. 2015లో వరల్డ్ నంబర్ 1 మహిళా షట్లర్‌గా ఆమె ఎదిగారు. సైనా తన కెరీర్‌లో 24 ఇంటర్నేషనల్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. 2009లో ప్రపంచ నెంబర్-02 స్థానంలో కొనసాగినా సైనా.. 2015లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా మెడల్స్‌ను సాధించిన విషయం విదితమే. 2018లో ఆమె తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడారు.

ఆదరిస్తారా!?
సైనా ముందు నుంచి కూడా బీజేపీ మద్దతుదారుగానే ఉన్నారు. పలుమార్లు నరేంద్ర మోదీని కూడా ఆమె కలిశారు. ఫిబ్రవరి-08న ఢిల్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున సైనా ప్రచారం చేస్తారని బీజేపీ పెద్దల నుంచి సమాచారం. గతంలో క్రీడారంగం నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి కీలక పదవుల్లో ఉండగా.. మరికొందరు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అయితే ఇన్ని రోజులుగా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా స్వాగతించిన.. ఆదరించిన అభిమానులు, ప్రజలు.. రాజకీయ నాయకురాలిగా ఏమాత్రం ఆదరిస్తారో..? ఈమెను ఎలాంటి పదవులు వరిస్తాయో..? వేచి చూడాల్సిందే మరి.

More News

విమానంలో కమెడియన్‌ వెకిలి చేష్టలు.. షాకిచ్చిన ఇండిగో!

బస్సు, ట్రైన్ లేదా విమాన ప్రయాణం ఇలా ఏదైనా సరే తోటి ప్రయాణికులతో మంచిగా ఉండకపోయినా పర్లేదు కానీ..

ప్రారంభమైన ప‌వ‌న్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీసెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం `పింక్‌` సినిమా తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

మోదీ తర్వాత రజనీకాంతే

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే... అవునా ఏ విషయంలో అనే సందేహం కలుగుతోంది కదూ..

'క్రాక్' కాపీ క‌థ‌నా?

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `క్రాక్‌`. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం.