నిర్మాణాంతర కార్యక్రమాల్లో సాయిరామ్ శంకర్ - విభా ఎంటర్ టైన్మెంట్ చిత్రం

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది..త్వరలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చెయనున్నారు.. ఈసందర్బంగా ..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ గా నిలిచే చిత్రమిది. మారిన తెలుగు సినిమా ట్రెండ్ కు తగ్గట్టు గా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో టాలెంటెడ్ టీమ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో భారీ సినిమాల ఆఫర్స్ నా వద్దకు వచ్చినా ,వాటన్నింటిని కాదని, దర్శకుడు సుదర్శన్ చెప్పిన కధకధనాలు నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.నాతో పాటు టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎన్నో కాంటెపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ చెసిన చిత్రమిది. ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా మా చిత్రం తెరకెక్కింబడింది. సినిమా ఔట్పుట్ చూసిన అనంతరం మా టీమ్ ఈ చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. సంగీతం: మహిత్ నారాయణ్.

More News

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో ఎవ‌రో కాదు...క‌మ‌ల్ హాస‌న్. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్.

50 కోట్ల క్ల‌బ్ లో ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో...సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

'తను వచ్చేనంట' రెండో షెడ్యూల్ మొదలైంది

తెలుగు ప్రేక్షకులకు కామెడీ బాగా తెలుసు.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే కదా! యాక్షన్, హారర్, లవ్.. ప్రతి కథలోనూ కామెడీ కంపల్సరీ అయ్యింది.

నానితో పోటీప‌డుతున్న ఆది

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు.

మా మ‌ధ్య అలాంటిదేమీ లేదంటున్న హ‌న్సిక‌

దేశముదురు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఆత‌ర్వాత కంత్రి, మ‌స్కా, దేనికైనా రెడీ..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. చంద్ర‌క‌ళ సినిమాతో భ‌య‌పెట్టిన హ‌న్సిక క‌ళావ‌తి సినిమాతో మ‌రోసారి భ‌య‌పెట్ట‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.