close
Choose your channels

సాయితేజ్ కొత్త సినిమా టైటిల్‌...?

Monday, October 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయితేజ్ కొత్త సినిమా టైటిల్‌...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో నటించిన యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సోలో బ్రతుకే సో బెటర్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నిజానిక క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ మూవీ మే 1కే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. త్వరలోనే సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. త్వ‌ర‌లోనే దేవాక‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇది వ‌ర‌కే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. పుల్లారావు, భ‌గ‌వాన్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్నట్లు టాక్‌.

ఈ సినిమాలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉంటుంద‌ట‌. సాయితేజ యంగ్ ఐఎయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇలాంటి పాత్ర చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డంతో సాయితేజ్ కొంద‌రు యంగ్ క‌లెక్ట‌ర్స్ ప‌నితీరుని వివిధ వీడియోల రూపంలో అబ్జ‌ర్వ్ చేస్తున్నాడ‌ని టాక్‌. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. చిత్ర‌ల‌హ‌రి చిత్రం త‌ర్వాత సాయితేజ్‌, నివేదా పేతురాజ్ క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. అలాగే ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో రాశీఖ‌న్నా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.