స‌ల్మాన్ సినిమా కూడా వాయిదా ప‌డుతుందా?

  • IndiaGlitz, [Monday,November 20 2017]

దీపికా ప‌దుకొనే టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'ప‌ద్మావ‌తి' సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల కావాల్సింది. అయితే సెన్సార్‌కు, చిత్ర యూనిట్ స‌రైన డాక్యుమెంట్స్ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో సెన్సార్ బోర్డు సినిమా సెన్సార్ ను ఆపేసింది. అంతే కాకుండా పాత రూల్‌ను తెర‌పైకి తెచ్చింది.

దాని ప్ర‌కారం సినిమా సెన్సార్ అప్లై చేయ‌డానికి 68 రోజులు ముందుగానే చేయాల‌ట‌. ఇది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మార‌నుంది. ఈ రూల్ ముందు నుండి ఉన్న‌ప్ప‌టికీ..బాలీవుడ్ వ‌ర్గాలు రూల్‌ను అనుస‌రించ‌డం మానేశాయి.

మ‌ళ్లీ ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల‌ను ఇరుకున పెట్ట‌నుంది. ముఖ్యంగా స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన 'టైగ‌ర్ జిందా హై' సినిమా ఇంకా సెన్సార్‌కు అప్లై చేయ‌లేదు.

ఇప్పుడు అప్లై చేసిన 68 రోజుల స‌మ‌యం అంటే సినిమా డిసెంబ‌ర్ 22న మాత్రం విడుద‌ల కాదు మ‌రి. మ‌రిప్పుడు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏం చేస్తారో చూడాలి.

More News

అక్కినేని-ఫాస్ ఫిలిం సొసైటీ 2017 సినీ, టివి. అవార్డులలో జయ కు సిల్వర్ క్రౌన్ అవార్డు

ఫాస్ 2017 సినీ అవార్డుల్లో ప్రముఖ దర్శకురాలు, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాలో ఒక విశిష్ట స్థానాన్ని పొందిన శ్రీమతి జయ బి. గారిని 'సిల్వర్ క్రౌన్ అవార్డు'తో సత్కరిస్తున్నామని ఫాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు తెలియజేశారు.

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌..

లీడ‌ర్‌, మిర‌ప‌కాయ్‌, భాయ్ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు అమెరికాలో చ‌దువుకుంటుంది. ఈ అమ్మ‌డు ఉన్న‌ట్లుండి సినిమాల‌కు బ్రేక్ చెప్పేసి, చ‌దువులో నిమ‌గ్నమైంది.

ఖకీ - బొక్స్ ఆఫిస్ కలెక్షన్ల మొత

ఇప్పుడు సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా 'ఖాకి' మాటలే. విడుదలైన మొదటి రొజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది 'ఖాకి'. ముందు నుంచీ తాము విన్నదే సినిమాలోనూ కనిపించేసరికి సినీ ప్రియుల్లో ఆనందం మొదలైంది.

ఆ ద‌ర్శ‌కుడితో సాయిధ‌ర‌మ్ మ‌ళ్లీ సినిమా..?

మెగా క్యాంప్ హీరోల్లో ఒక‌డు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించిన 'జ‌వాన్‌' డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించింది. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వైష్ణో కృష్ణ ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

'జ‌వాన్‌'కు కొర‌టాల స‌పోర్ట్‌..

మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం 'జ‌వాన్‌'. ఈ సినిమా డిసెంబర్ 1న విడుద‌ల కానుంది. టైటిల్ విన‌గానే ఇదేదో దేశ‌భ‌క్తి సినిమా అనుకోవ‌ద్దు..దేశ‌భ‌క్తి సినిమా కాదు. కుటుంబం కోసం జ‌వానులా పోరాడే యువ‌కుడి క‌థ‌.