close
Choose your channels

తెలుగులో సల్మాన్ చిత్రం

Wednesday, August 21, 2019 • తెలుగు Comments

తెలుగులో సల్మాన్ చిత్రం

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో ఒకరైన సల్మాన్ ఖాన్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను తన సినిమాతో పలకరించబోతున్నారు. అదేంటి? ఆయన నటిస్తున్న తెలుగు సినిమా ఏది? అని అనుకునేరు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం `దబాంగ్ 3`ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. 

తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారని సమాచారం. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. `వాంటెడ్` తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Get Breaking News Alerts From IndiaGlitz