Download App

కూర‌గాయ‌లు అమ్మిన సామ్‌...

స‌మంత సినిమాలో సన్నివేశంలో కాకుండా.. నిజంగానే కూర‌గాయ‌లు అమ్మింది. అదేంటి స‌మంత కూర‌గాయ‌లు అమ్మిందా? అక్కినేని వారింటి కోడ‌లు కూర‌గాయ‌లు అమ్మ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా?  వివ‌రాల్లోకెళ్తే స‌మంత ప్ర‌త్యూష చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ కోసం స‌మంత చెన్నై ట్రిపిల్ కేన్‌లోని జామ్‌బజార్‌కు వెళ్లి అక్క‌డ ఓ కూర‌గాయ‌ల దుకాణంలో కూర‌గాయ‌లు అమ్మారు. ముందు జ‌నం ఆశ్చ‌ర్య‌పోయినా.. త‌ర్వాత అస‌లు సంగ‌తి తెలుసుకుని కూర‌గాయ‌లను కొన్నారు.

స్టార్ హీరోయిన్‌.. అందులోనూ ఓ పెద్దింటి కోడ‌లు అయినా కూడా స‌మంత బేషజాల‌కు పోకుండా.. కూర‌గాయ‌లు అమ్మ‌డం త‌ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌నుకోవ‌డం గొప్పే క‌దా!