స‌మంత పేరు మార్పు...

  • IndiaGlitz, [Wednesday,October 11 2017]

హీరోయిన్ స‌మంత ఇప్పుడు అక్కినేని వారింటి కోడ‌లు. ఈ అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గోవాలో హిందూ, క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తుల్లో వివాహమైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు స‌మంత త‌న పాత పేరుతోనే కొన‌సాగుతుందా? పేరు మార్చుకుంటుందా అనే సందేహం అంద‌రిలో క‌లిగింది. సందేహలేమ‌క్క‌ర్లేదనేలా స‌మంత ట్విట్ట‌ర్‌లో త‌న పేరు స‌మంత అక్కినేనిగా మార్చుకుంది.

అయితే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత రుత్‌ప్ర‌భు అనే పేరు క‌న‌ప‌డుతుంది. స‌మంత మావ‌య్య..అదేనండి అక్కినేని నాగార్జున‌, స‌మంత క‌లిసి న‌టించిన రాజుగారిగ‌ది 2 సినిమా ఈ శుక్ర‌వారం..అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డితే, స‌మంత ఆత్మ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది.

More News

నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్రల్లో 'ఆటగాళ్లు' ప్రారంభం

స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం "ఆటగాళ్లు". ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న

పూరి కోసం బాల‌య్య ముహుర్తం...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'మెహ‌బూబా'.  ఈ సినిమాలో పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్నారు. ఈరోజు ఉద‌యం 8.20 నిమిషాల‌కు సినిమాను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్రారంభించారు.

ప్ర‌కాష్ రాజ్ గురించి వ‌ర్మ క్లారిటీ

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఆ పాత్ర మ‌రెవ‌రిదో కాదు. ఆంధ్రుల ఆరాధ్య నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌. ఇంత‌కు ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యాన్ని ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు...వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

నయనతార పొలిటికల్ డ్రామా చిత్రం కర్తవ్యం

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్  నిర్మాతగా  ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts )  పతాకం పై తమిళం లో నిర్మించబడుతున్న ఆరమ్ (Araam)  చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు.

సుశాంత్ - రాహుల్ మూవీ ప్రారంభం

తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజ కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం)ప్రారంభం అయ్యింది. సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం.