పేరు మార్చుకున్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని పేరు మార్చుకోవడం ఏంటి? అనే సందేహం రాక మానదు. అయినా ఇది నిజం. ఇంతకు ఆమెను పేరు మార్చుకునేలా చేసిందేంటి? అనే ప్రశ్నకు సమాధానం సినిమా. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `ఓబేబీ`. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి తెలుగు రీమేక్ ఇది. నందినీ రెడ్డి దర్శకురాలు.
రావు రమేష్, రాజేందప్రసాద్, నాగశౌర్య ప్రధాన పాత్రధారులు. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. రీసెంట్గా విడుదలైన టీజర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సమంత ఈ సినిమా పేరునే తన పేరుగా మార్చుకుంది. తన ట్విట్టర్ అకౌంట్‌ను బేబీ అక్కినేని మార్చుకుని.. సదరు సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పిందీ అమ్మడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.