close
Choose your channels

'అ..ఆ..' కోసం స‌మంత డ‌బ్బింగ్‌?

Monday, November 9, 2015 • తెలుగు Comments

తెలుగు భాష‌ని స్ప‌ష్టంగా మాట్లాడే ప‌ర‌భాష ముద్దుగుమ్మ‌ల‌లో స‌మంత‌ది ప్ర‌త్యేక స్థానం. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో మ‌రింత‌మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ చిన్న‌ది.. ఇప్పుడిప్పుడే త‌న మాతృభాష‌లో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం మొద‌లుపెడుతోంది. ఇక తెలుగులోనే త‌రువాయి అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి.

త‌న సొంత గొంతుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌నుకుంటున్న స‌మంత‌.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న 'అ..ఆ..' కోసం తొలి ప్ర‌య‌త్నం చేయ‌బోతుందంటూ ఇన్ సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. స‌మంత‌కి అత్యంత స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ ఆమెకి ఆ అవ‌కాశ‌మిచ్చి ప్రోత్స‌హిస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz