'దర్శకుడు' చిత్ర పాటను ఆవిష్కరించిన సమంత

  • IndiaGlitz, [Tuesday,July 11 2017]

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం లోని 'సండే టు సాటర్డే లవ్' అనే పాటను ప్రముఖ కథానాయిక సమంత రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాయికార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను ఈ నెల 15న ప్రముఖ కథానాయకుడి చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్రెడీ ఓ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం లోని 'సండే టు సాటర్డే లవ్' అనే పాటను ప్రముఖ కథానాయిక సమంత గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాము. ఈ పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అని తెలిపారు.

అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్,

More News

బాలయ్య భారీ ఆలోచన....

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' తెలుగులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

పెర్ఫామెన్స్ , కలెక్షన్స్ పరంగా వరుణ్ తేజ్ కెరీర్ లో 'ఫిదా' ది బెస్ట్ మూవీ అవుతుంది - దిల్ రాజు

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'ఫిదా'.

మెగా పవర్ స్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రం!

కొన్ని కాంబినేషన్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఎప్పుడెప్పుడా అని వెయ్య కళ్లతో ఎదురుచూసేలా చేస్తాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటితమైన మెగా పవర్ స్టార్ రామ్చరణ్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ కాంబినేషన్ అలాంటిదే.

దిలీప్ అరెస్ట్

ప్రముఖ మలయాళ నటి భావన అపహరణ,లైంగిక వేధింపులు కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టెలివిషన్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా 'అంబికా' కృష్ణ

'భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా అగరుబత్తి'అనే కాప్షన్ దేనికి సంబందించినదో తెలుగు వారికి తెలియనిది కాదు.