Samantha :సిటాడెల్ ప్రీమియర్ షోలో మెరిసిన సమంత.. ఆమె ధరించిన స్నేక్ నెక్లెస్, బ్రాస్లెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

  • IndiaGlitz, [Saturday,April 22 2023]

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వున్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంక్షోభం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినప్పటికీ సమంత నటన, మేకోవర్ అభిమానులకు కొత్తదనం పంచింది. ఈ క్రమంలో సమంత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై దృష్టిపెట్టింది. అమెరికన్ థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్' వరల్డ్ ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు గాను సామ్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో సమంత , వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత ఒంటిపై నగలతో ఓ సినిమా తీయొచ్చు :

ఇకపోతే.. సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ వచ్చిన సమంత పూర్తిగా మోడ్రలన్ లుక్‌లో కనిపించారు. బ్లాక్ డ్రెస్‌లో నడుము చూపిస్తూ హోయలు ఒలకబోశారు. అందులోనూ ఆమె పెట్టుకొచ్చిన డైమండ్ జ్యువెలరీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీంతో అభిమానులు సమంత డ్రెస్, డైమండ్ జ్యూవెలరీపై ఇంటర్నెట్‌లో తెగ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి సమంత బ్లాక్ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.65 వేలు. విక్టోరియా బెక్‌హామ్ క్రోచెట్ ప్యాచ్ వర్క్ స్కర్ట్‌గా పిలిచే ఈ మోడల్‌లో సామ్ అదరిపోతున్నారు. మరి ఇంతటి కాస్ట్‌లీ డ్రస్ వేసుకున్నప్పుడు సాదా సీదా నగలు పెట్టుకుంటే ఏం బాగుంటుంది. అందుకు తగ్గట్లుగానే సమత బల్గారీ డైమండ్ జ్యూవెలరీ ధరించింది. స్నేక్ నెక్లెస్‌గా పిలిచే దీని ధర అక్షరాలా రూ.2.9 కోట్లు, అలాగే చేతికి పెట్టుకున్న బ్రెస్ లైట్ ధర రూ.2.6 కోట్లు వుంటుందని అంచనా. దీంతో సమంత జ్యూవెలరీ, ఆమె దుస్తుల విలువ తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సమంత బ్లాక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోన్న సమంతా :

ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత సిటాడెల్‌తో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖుషీ’ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సామ్ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.