స‌మంత చిత్రంలో ఆ హీరో?

  • IndiaGlitz, [Wednesday,October 17 2018]

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'యూ ట‌ర్న్‌'సినిమా న‌టిగా స‌మంత‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి ఓ సినిమా న‌టిస్తుంది. ఇది కాకుండా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కొరియ‌న్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్ అని.. ఇందులో అతీత శ‌క్తులున్న వృద్ధురాలు త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుందట‌. సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించ‌నున్నాట్ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి. స‌మంతతో పాటు నాగ‌శౌర్య కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

రామ్ అసంతృప్తి...

ఎనర్జ‌టిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం 'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే'. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

లారెన్స్ ప్రామిస్ చేశాడ‌ట‌...

కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వ లారెన్స్ త‌న‌కు ప్రామిస్ చేశాడ‌ని అంటుంది శ్రీరెడ్డి.

గ‌ర్వంగా ఫీల‌వుతున్న సుదీప్‌...

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్.. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో అవుకు రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

టాటా బైబై చెప్పేసి క‌ల్యాణి

సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.