నాతో మామూలుగా ఉండ‌దంటోన్న స‌మంత‌

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను ప‌క్క‌న పెట్టి పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌తో స‌మంత స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇప్ప‌డు ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ఓ బేబి'. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా టీజ‌ర్‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ 55 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో విడుద‌ల చేశారు. నా పేరు సావిత్రి.. చిన్న‌ప్పుడు నన్ను భానుమ‌తిలా అందంగా ఉన్నావ‌ని అంద‌రూ అనేవాళ్లు అనే ల‌క్ష్మి డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైతే జ‌గ‌ప‌తిబాబు వాయిస్ ఓవ‌ర్‌లో ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా ! అని అంటాడు.

మీరు న‌న్ను పాతికేళ్ల‌ప్పుడు చూడాల్సింది. అనే డైలాగ్స్ వ‌స్తాయి. మ‌రో ప‌క్క సింగ‌ర్‌గా స‌మంత క‌న‌ప‌డుతుంది. ఆమెను ఇష్ట‌ప‌డే పాత్ర‌లో నాగ‌శౌర్య క‌న‌ప‌డ‌తాడు. 'బాయ్‌ఫ్రెండ్స్ ఎవ‌రూ లేరుగా!' అని నాగ‌శౌర్య అడిగితే ల‌క్ష్మి త‌న చిన్నత‌నం గురించి సింపుల్‌గా చెబుతుంది. కానీ నాగ‌శౌర్య న‌మ్మ‌డు. ఎందుకంటే ల‌క్ష్మి స‌మంత రూపంలో ఉండ‌ట‌మే ఈ టీజ‌ర్ ప్ర‌త్యేక‌త‌.

సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైన‌ర్‌లా అనిపిస్తుంది. చివ‌ర‌ల్లో నాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండ‌దు. ఒక్కొక్క‌డికి చూస్తారుగా! అనే డైలాగ్‌తో టీజ‌ర్ ముగుస్తుంది. ఓ బేబి టైటిల్ సాంగ్‌ను టీజ‌ర్‌లో చూపించారు. ఇంకా ఈ టీజ‌ర్‌లో రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌న‌ప‌డ్డారు. కొరియ‌న్ రీమేక్ మిస్‌గ్రానీ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. జూన్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.