సమంతకి రిపీట్ అవుతుందా?

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

ప్ర‌తి ఒక్క న‌టుడికి లేదా న‌టికి కొన్ని లైఫ్ చేంజ్ మూవీస్ ఉంటాయి. స‌మంత‌కి కూడా అలాంటి సినిమాలు రెండు ఉన్నాయి. అవే 'ఏమాయ చేసావె', 'మ‌నం'. మొద‌టి చిత్రం త‌రువాత ఆమె జాత‌కం ఒక్క సారిగా మారింది. అయితే 'మ‌నం' త‌రువాత మాత్రం స‌మంత గ్రాఫ్ కొంచెం కొంచెంగా డౌన్ అవుతోంది. ఎందుకంటే.. 'మ‌నం'లో అంత మంచి పాత్ర పోషించ‌డం ఒక కార‌ణ‌మైతే.. త‌రువాత వ‌చ్చిన సినిమాల్లో ఆమె పాత్ర‌ల్లో ప‌స‌లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం.

'మ‌నం'లో రెండు విభిన్న పాత్ర‌ల్లో స‌మంత క‌న‌బ‌రిచిన అభిన‌యం ఇప్ప‌టికీ వార్త‌ల్లో నిలిచే అంశ‌మే. 'మ‌నం' త‌రువాత ఆ స్థాయి పాత్ర చేయ‌ని స‌మంత.. రాబోయే '24'లో అలాంటి పాత్ర చేశాన‌ని చెప్పుకొస్తోంది. 'మ‌నం' ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మే నెల‌లో విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. 'మ‌నం' కూడా మే నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం. మ‌రి 'మ‌నం' హిట్ సెంటిమెంట్ '24' విష‌యంలో స‌మంత‌కి రిపీట్ అవుతుందేమో చూడాలి.

More News

'జక్కన్న' కి సునీల్ సెంటిమెంట్

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న కథానాయకులలో సునీల్ ఒకరు.

'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

జయాపజయాల సంగతి పక్కన పెడితే..కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు.అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు.

'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

జయాపజయాల సంగతి పక్కన పెడితే..కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు.అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు.

ఆర్తి అగర్వాల్ బాటలో నయనతార వెళుతుందా?

పదకొండేళ్ల క్రితం అందాల తార ఆర్తి అగర్వాల్ ఓ క్రెడిట్ ని తన సొంతం చేసుకుంది.మళ్లీ ఇప్పుడు అదే దిశ గా మరో తార ప్రయత్నం చేస్తోంది.

స‌ర్ధార్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.