close
Choose your channels

అమ‌ల‌ను పొగుడుతున్న స‌మంత‌

Wednesday, June 19, 2019 • తెలుగు Comments

అమ‌ల‌ను పొగుడుతున్న స‌మంత‌

హెడ్డింగ్ చూసి త‌న అత్త‌గారు అమ‌ల‌ను స‌మంత పొగుడుతుందా?  అని అనుకుంటున్నామో. అలా అనుకుంటే త‌ప్పులో బుర్రేసిన‌ట్టే . ఇప్పుడు స‌మంత పొగిడింది అమ‌లాపాల్‌ను. మ‌ల‌యాళ భామ అమ‌లాపాల్ తెలుగువారికి కూడా సుప‌రిచితురాలే. త‌మిళంలో ఆమె తాజాగా `ఆడై` అనే సినిమాలో న‌టించింది. ర‌త్న‌కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చ‌త్రం టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో టీజ‌ర్ విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. అమ‌లాపాల్ ఇందులో బోల్డ్ గా న‌టించ‌డ‌మే అందుకు కార‌ణం. దీని గురించి స‌మంత స్పందించారు. ``లుక్స్ అమేజింగ్‌. అమ‌లా ఆమ్స్.. ఆల్ ది బెస్ట్. క్యూరియాసిటీ లెవ‌ల్స్ హై. లుకింగ్ ఫార్వ‌ర్డ్` అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇత‌ర న‌టీమ‌ణుల‌ను, ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌ను స‌పోర్ట్ చేయ‌డంలో ఈ మ‌ధ్య కాలంలో స‌మంత ముందుంటున్నార‌ని ఆమె అభిమానులు ఆనందంగా చెబుతున్నారు. `ఆడై` సినిమా సెన్సార్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz