close
Choose your channels

ఏదైనా చైత‌న్య త‌ర్వాతే అంటున్న‌ స‌మంత‌

Tuesday, September 11, 2018 • తెలుగు Comments

ఏదైనా చైత‌న్య త‌ర్వాతే అంటున్న‌ స‌మంత‌

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న యు ట‌ర్న్‌తో ఈ నెల 13న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోయే సంగ‌తి తెలిసిందే. అయితే అదే రోజున ఆమె భ‌ర్త‌.. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య 'శైల‌జారెడ్డి అల్లుడు' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

భర్త‌, భార్య‌లు ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతుండ‌టం అంద‌రిలో ఆస‌క్తిని రేపుతున్నా.. స‌మంత మాత్రం రెండు సినిమాలు హిట్ కావాల‌ని కోరుకుంటుంది. అయితే ముఖ్యంగా శైల‌జారెడ్డి అల్లుడు స‌క్సెస్‌ను బ‌లంగా కోరుకుంటుంది. ఎందుకంటే భ‌ర్త‌గా చైత‌న్య స‌క్సెసే అన్నింటి కంటే ముఖ్యం అంటూ ఆమె చెప్ప‌డం కొస‌మెరుపు.