close
Choose your channels

స‌మంత రియాలిటీ షో!!

Monday, February 24, 2020 • తెలుగు Comments

స‌మంత రియాలిటీ షో!!

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా కూడా నిలుస్తుంది. సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. `ద ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారామె. ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప్లాన్ చేస్తున్న స‌మంత అక్కినేని తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

స‌మాచారం మేర‌కు స‌మంత ఓ రియాటిలీ షోలో వ్యాఖ్యాత‌గా చేయ‌బోతున్నార‌ట‌. తెలుగు ఓటీటీ సంస్థ అహా.. స‌మంత‌ను ఓ రియాలిటీ షో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే స‌మంత దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తుంది. అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే అక్కినేని వారింటి అక్కినేని నాగార్జున .. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, బిగ్‌బాస్ వంటి షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ త‌ర్వాత స‌మంత మాత్ర‌మే ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకున్న‌ట్లు అవుతుంది. మ‌రి అక్కినేని వారి కోడ‌లు రియాలిటీ షో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందంటారా!.

Get Breaking News Alerts From IndiaGlitz