స‌మంత @ 1.5 కోట్లు

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

స‌మంత అక్కినేని 1.5 కోట్లు ఏంటి? ఏదేని సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అని అనుకుంటున్నారా? కాదండి.. సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ఇన్‌స్టాలో స‌మంత‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య‌. ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత అక్కినేనిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 మిలియ‌న్స్‌కు చేరింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాలో తెలియ‌జేసిన సామ్ ' ఇప్పుడు షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇన్‌స్టాలో 15 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్‌తో నాకు స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది. లైకులు, కామెంట్స్‌తో న‌న్నెంతో ప్రోత్స‌హించిన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు. మీ వ‌ల్ల మ‌రింత ఉన్న‌తంగా ప‌నిచేయాల‌నే ఫీలింగ్ వ‌చ్చింది. ల‌వ్యూ యు ఆల్‌'' అని అన్నారు స‌మంత‌.

స‌మంత అక్కినేని.. పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంది. కానీ, గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. ఓటీటీలో సామ్ జామ్ ప్రోగామ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. త్వ‌ర‌లోనే గుణశేఖ‌ర్ రూపొందిస్తోన్న హిస్టారిక‌ల్ మూవీ 'శాకుంత‌లం'లో శ‌కుంత‌ల పాత్ర‌లో న‌టించ‌నుంది స‌మంత‌. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మరో వైపు సమంత నటించిన వెబ్ సిరీస్ ది ప్యామిలీ మ్యాన్ 2 విడుదలకు సన్నద్ధమవుతోంది.

More News

‘నాంది’ ట్రైలర్: నా జీవితం ఇప్పుడే మొదలైంది..

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’.

రాజశేఖర్ 92ను ప్రకటించేశారు..

హీరో రాజశేఖర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

భార్యను చంపి అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడిపాడు.. కానీ కథ అడ్డం తిరిగింది

పెళ్లయిన రెండు నెలలకే భార్యను హతమార్చి తన పైకి కేసు రాకుండా పెద్ద స్కెచ్చే వేశాడు. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపాడు.

పవన్ టైటిల్ ఫిక్స్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

థియేటర్స్‌ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

థియేటర్స్‌ యాజమాన్యాలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ