జనత గ్యారేజ్ షూటింగ్ ఆపేసిన సమంత..!

  • IndiaGlitz, [Tuesday,August 02 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ కో్సం కేర‌ళ‌లో ఎన్టీఆర్, స‌మంత పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే....స‌మంత షూటింగ్ ఆపేసింద‌ట‌. అంతే కాకుండా...డైరెక్ట‌ర్ కొర‌టాల త‌ను చెప్పిన‌ట్టు చేస్తేనే షూటింగ్ కు వ‌స్తాన‌ని చెప్పింద‌ట‌. ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌మంతే చెప్పింది. ఇంత‌కీ స‌మంత ఏం చేయ‌మ‌న్న‌ది అంటే...ఎన్టీఆర్, స‌మంత పై వాన పాట చిత్రీక‌రిస్తున్నార‌ట‌. మాతో పాటు డైరెక్ట‌ర్ కొర‌టాల త‌డిస్తేనే షూటింగ్ అంటూ బ్రేక్ చెప్పింద‌ట‌. ఆఖ‌రికి స‌మంత చెప్పిన‌ట్టుగా కొర‌టాల కూడా త‌డిసిన త‌ర్వాతే స‌మంత షూటింగ్ కి సై అన్న‌ద‌ట‌. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స‌మంత తెలియ‌చేస్తూ...షూటింగ్ స్పాట్ లోని ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

More News

సక్సెస్ కోసం మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు..

మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.

ఇంకొక్కడు లో డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన విక్రమ్

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2చిత్రంలో నటిస్తున్నారు.

సెప్టెంబర్ లో రానున్న కాకతీయుడు

నందమూరి తారకరత్న,శిల్ప,యామిని,రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కాకతీయుడు.ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి లేటెస్ట్ అప్ డేట్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.