సమంత పాన్ ఇండియా మూవీ..?

  • IndiaGlitz, [Monday,June 22 2020]

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా కూడా నిలుస్తుంది. సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేయగా అందులో సమంత నటించిన సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత 'ద ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించింది. ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సమంత అక్కినేని.

తాజా స‌మాచారం మేర‌కు స‌మంత అక్కినేని ఓ పాన్ ఇండియా మూవీలో న‌టించ‌నుంద‌ని టాక్. బాలీవుడ్‌లో సినిమాల‌ను నిర్మించే సోనీ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ట‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌బోయే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు? అనేది డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయట‌. త‌మిళ ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియనున్నాయి.

More News

బాల‌య్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు

తెలుగు నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్‌లో న‌టించిన న‌టి రాధికా ఆప్టే. ఆమెకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అరుదైన అవార్డు ల‌భించింది.

మ‌హేశ్ ‘సర్కారు వారి పాట’లో చెర్రీ విల‌న్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ ఫారిన్ వెళ్తాడా?

క‌రోనాకు పెద్దా చిన్నా తేడా లేకుండా అంద‌రూ వ‌ణుకుతుంటే, ప్ర‌భాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?

విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాపై అమృత స్పందించలేదు: బాలస్వామి

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తను తీయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.