అగ్ర నిర్మాణ సంస్థ సినిమాలో సమంత..?

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా కూడా నిలుస్తుంది. సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. 'ద ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారామె. ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సమంత అక్కినేని.

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మంతో ఓ మ‌హిళా ప్రాధాన్య‌మున్న సినిమా చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. స‌మంత డేట్స్ ఈ సంస్థ ద‌గ్గ‌ర ఉన్నాయని, కాబ‌ట్టి ఇప్పుడు స‌ద‌రు సంస్థ స‌మంత‌తో సినిమా చేయడానికి మంచి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో భాగంగా రెండు, మూడు క‌థ‌ల‌ను రెడీ చేసింద‌ట‌. స‌మంత ఓకే త్వ‌ర‌లోనే సినిమా ట్రాక్ ఎక్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి వీరి ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫలిస్తాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.