close
Choose your channels

ఫెడ‌వుట్ హీరోతో సామ్‌!!

Monday, March 16, 2020 • తెలుగు Comments

ఫెడ‌వుట్ హీరోతో సామ్‌!!

ప్ర‌స్తుతం మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న హీరోయిన్స్‌లో స‌మంత అక్కినేని ఒక‌రు. గ‌త ఏడాది ఓ బేబి చిత్రంతో హిట్ అందుకున్న స‌మంత కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్‌లో టెర్ర‌రిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌ట‌మే కాదు.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ న‌టించింది. కాగా.. ఇప్పుడు ఈమె తదుప‌రి లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రంగం సిద్ధ‌మైంది. గ‌తంలో న‌య‌న‌తార‌తో మ‌యూరి, తాప్సీతో గేమ్ ఓవ‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌రవ‌ణ‌న్ ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో తెర‌కెక్కించ‌బోతున్నాడు.

ఈ సినిమాలో స‌మంత పాత్ర‌కే ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. హీరో పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఉండ‌దు. కాబ‌ట్టి.. ఫెడ‌వుట్ అయిన హీరో ప్ర‌శాంత్ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. కెరీర్ ప్రారంభంలో దొంగ దొంగ‌, జీన్స్ వంటి చిత్రాల‌తో ప్ర‌శాంత్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య హిట్స్ లేవు. అయితే ఇప్పుడు ప్ర‌శాంత్ బాలీవుడ్ చిత్రం అంధాదున్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. అలాగే ఇప్పుడు స‌మంత‌తో న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ట‌. మ‌రి ఈ చిత్రంలో ప్ర‌శాంత్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz