యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి..

  • IndiaGlitz, [Friday,September 07 2018]

సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు.

పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.

More News

'అనగనగ ఓ ప్రేమకథ' తొలి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన  వరుణ్ తేజ్

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు.

వినాయక చవతికి విడులవుతున్న 'మసక్కలి'

కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

ఉత్కంఠతను పెంచే యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా 'కురుక్షేత్రం'

యాంక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150 సినిమా కురుక్షేత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్దం అయ్యింది.

ప్రభాస్ త్రిభాషా చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు

సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌వుతున్న 'ఈ మాయ పేరేమిటో'

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌.