సెప్టెంబ‌ర్ 13న స‌మంత యు ట‌ర్న్ విడుద‌ల‌..

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

యు ట‌ర్న్ విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 13న ఖ‌రారైంది. స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన యు ట‌ర్న్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

త‌మిళ‌, తెలుగులో క‌లిపి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమికా చావ్లా యు ట‌ర్న్ లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.