చైతన్యతో సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ప్రస్తుతం `మన్మథుడు 2` సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `సోగ్గాడే చిన్నినాయనా` సీక్వెల్గా `బంగార్రాజు` సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్నారనే సంగతి తెలిసిందే.
నాగార్జున జోడిగా రమ్యకృష్ణ నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. కాగా.. నాగచైతన్య జోడిగా సమంతను నటింప చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. కాగా.. చైతన్య, సమంత జోడిగా నటిస్తే మరింత అంచనాలు పెరుగుతాయని యూనిట్ భావిస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.