close
Choose your channels

స‌మంత బ్యూటీ థెర‌ఫీ

Friday, July 10, 2020 • తెలుగు Comments

స‌మంత బ్యూటీ థెర‌ఫీ

స్టార్ హీరోయిన్ స‌మంత లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో వంట నేర్చుకోవ‌డం, యోగా చేయ‌డంతో పాటు టెర్ర‌స్ గార్డెనింగ్ ప‌నుల‌తో బిజీ బిజీగా క‌నిపించారు. ఈరోజు మాత్రం త‌న అభిమానుల‌కు స‌మంత బ్యూటీ థెర‌ఫీని సూచించారు. తాజాగా విట‌మ‌న్ ఇన్‌ఫ్యూష‌న్ థెర‌ఫీకి సంబంధించిన వీడియోను స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నేను తోట‌ప‌ని చేయ‌డం, వంట ప‌నిచేయ‌డం వంటి వీడియోల‌ను చూసి మీలో కొంత మందికి బోర్ కొట్టి ఉండొచ్చు. మ‌రి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌, గ్లోయింగ్ స్కిన్‌ను ఎలా పొంద‌డం అనే దాని గురించి చెబుతూ ఇన్‌ఫ్యూష‌న్ థెర‌ఫీ గురించి స‌మంత ప్ర‌స్తావించారు. ఈ థెర‌ఫీ ద్వారా స్కిన్‌లో గ్లో పెరుగుతుంద‌ని ఆమె తెలిపారు.

స‌మంత బ్యూటీ థెర‌ఫీ

ఇక సినిమాల విషయానికి వస్తే జాను తర్వాత సమంత మరో సినిమాను ఒప్పుకోలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను చేయనుందని టాక్. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించడానికి చర్చలు జరుపుతున్నారని సినీ వర్గాల సమాచారం. ఇది కాకుండా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. అలాగే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి చైత‌న్య‌తో క‌లిసి న‌టించ‌నుంద‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz