సామ‌జ వ‌ర‌గ‌మ‌న .. నిను చూసి ఆగ‌గ‌ల‌నా !

  • IndiaGlitz, [Saturday,September 28 2019]

నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌వి చూడే నా క‌ళ్లు..
ఆ చూపుల‌న‌లా తొక్కుతూ వెళ్ల‌కు ద‌య‌లేదా అస‌లు
నీ క‌ళ్ల‌కు కావాలి కాస్త కాటుక‌లా నా క‌ల‌లు
నువ్వు నులుముతుంటే ఎర్ర‌గకంది చిందేనే సెగ‌లు
నా ఊపిరి గాలికి ఊయ్యాల‌లుగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టెస్తే అలా నిట్టూర్చ‌వ‌టే నిట్ఠుర‌పోవే విల విల‌లు
సామ‌జ వ‌ర‌గ‌మ‌న .. నిను చూసి ఆగ‌గ‌ల‌నా !

అంటూ ప్రేయ‌సి పూజా హెగ్డేని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నాడు హీరో బ‌న్నీ. ఈ క్ర‌మంలో ఆయ‌న పాడిన పాటే ఇది. అస‌లు బన్నీ ఎందుకీ పాట పాడాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 'అల వైకుంఠ‌పురములో..' సినిమాలోనీ మెలోడీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడ‌గా, త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. శనివారం విడుదలైన ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంది. జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కోటీశ్వ‌రుడి బిడ్డ పేద‌వాడుగా, పేద‌వాడి కొడుకు కోటీశ్వ‌రుడిగా పెరుగుతారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నేదే ఈ సినిమా క‌థాంశమ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న బ‌న్ని ఈ సినిమాను చేస్తున్నాడు.

More News

‘సైరా’ను వీళ్లు చూసేశారు.. ప్లస్, మైనస్‌లు ఇవే!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’.

'గద్దల కొండ గణేష్' సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మెగా ఫ్యాన్స్ కి థాంక్స్ - వరుణ్‌ తేజ్‌

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'.

'దండుపాళ్యం' నవంబర్ 1న విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’

'డబ్ స్మాష్' సాంగ్ విడుదల

వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది.

పాట చిత్రీక‌ర‌ణ‌లోనూ సైరా రికార్డ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరు 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో