'బ్రూస్ లీ' కోసం సేమ్ ఫార్ములా నాలుగోసారి

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

'దూకుడు'తో శ్రీ‌నువైట్ల - థ‌మ‌న్ కాంబినేష‌న్ జ‌ర్నీ మొద‌లై 'బాద్‌షా', 'ఆగ‌డు'..అంటూ ప్ర‌స్తుతానికి 'బ్రూస్ లీ' వ‌ర‌కు సాగింది. ఈ నాలుగు చిత్రాలూ మ్యూజిక్ ప‌రంగానైతే నిరాశ‌ప‌ర‌చ‌లేదు. అయితే.. క‌మ‌ర్షియ‌ల్ గా 'ఆగ‌డు' నిరాశ‌ప‌రిచింది. 'బ్రూస్ లీ' ఫ‌లితం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ నాలుగు సినిమాల కోసం వైట్ల‌, థ‌మ‌న్ కాంబినేష‌న్ ఓ విష‌యాన్ని రిపీట్ చేసింది. అదేమిటంటే.. సినిమాలోని హీరోయిన్ పాత్ర పేరు వ‌చ్చేలా ఓ పాట‌ని డిజైన్ చేయ‌డం.

'దూకుడు' కోసం 'గురువారం' పాట‌లో హీరోయిన్ పేరు ప్ర‌శాంతిని 'శాంతి..శాంతి..' అంటూ వినిపింప‌జేస్తే.. 'బాద్‌షా'లో 'బంతి పూల జాన‌కి'ని.. 'ఆగ‌డు'లో 'ఆజా స‌రోజ' అంటూ కొన‌సాగించారు. ఇక 'బ్రూస్ లీ' లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ పేరు అయిన రియాని కూడా 'రియా రియా'పాట కోసం వాడుకున్నారు. మ‌రి ఈ కాంబినేష‌న్‌లో ఎన్ని చిత్రాలొచ్చినా.. ఈ ఫార్ములాని మాత్రం మ‌రిచిపోయేలా లేరు అంటూ సినీ ప‌రిశీల‌కులు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన 'బ్రూస్‌లీ' ఈ నెల 16న రిలీజ్ కానుంది.