close
Choose your channels

మేకప్ లేకుండా సమీరారెడ్డి.. వావ్ అనిపిస్తున్న ఒరిజనల్ లుక్‌!

Friday, July 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మేకప్ లేకుండా సమీరారెడ్డి.. వావ్ అనిపిస్తున్న ఒరిజనల్ లుక్‌!

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన తారలంతా అలా తళుక్కుమని.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అలాంటి వారిలో.. తన అందచెందాలతో కుర్రకారును కైపెక్కించిన సమీరారెడ్డి కూడా ఒకరు. స్టార్ హీరోల సరసన సైతం నటించి మెప్పించిన ఈ భామ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా తన రేంజ్ ఏంటో చూపించింది. అయితే ఈ భామ తెలుగు సినిమాల్లో మెరిసి ఇప్పటికి చాలా రోజులైపోయింది.

సినిమాలకు దూరమైన తర్వాత పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ.. త్వరలోనే పండంటి బిడ్డకు రెండోసారి జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా తన ఫొటోలను అభిమానులు, సినీ ప్రియులు, నెటిజన్లతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. తాజాగా.. తన ఒరిజినల్ అంటే మేకప్ లేకుండా ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వితౌట్ మేకప్‌తో సమీరాను చూసిన అభిమానులు వావ్ సూపర్బ్.. అదుర్స్ అని కితాబిస్తున్నారు.

కాగా.. ఇటీవలే కాజల్ మేకప్ లేని ఫొటోను ధైర్యం చేసి మరీ నెట్టింట్లో షేర్ చేసింది. అప్పట్లో కాజల్ అందంపై కొందరు నెగిటివ్‌గా కామెంట్స్ చేసినప్పటికీ మరికొందరు మాత్రం ఆమెను మెచ్చుకున్నారు. తాజాగా అదే బాటలోనే సమీరారెడ్డి కూడా నడిచిందన్న మాట. ఓ వీడియోను పోస్ట్ చేసిన సమీరా.. తన ఆలోచన ఏంటో ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేయడం వలన మీద విమర్శలు వస్తాయని తెలుసని.. ఇప్పటి వరకు మేకప్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన తాను.. ఇపుడు అచ్చమైన రూపాన్ని బయటపెట్టాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సమీరా రాసుకొచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.